కళ్యాణ యోగం కల్పించే ‘కాళీ రూపం’
కంచి కామాక్షి ఆలయం వెనుక కాళీ కొట్టమ్‌లో ఆది కామాక్షి దేవి కొలువై ఉంటారు. పార్వతీ దేవియే ఇక్కడ కాళీమాత రూపంలో వెలిశారని చెబుతారు. ఈ ఆలయంలో అమ్మవారి రూపం శివలింగంపై కొలువై ఉంటుంది. అర్ధనారీశ్వర లింగంగా పూజలందుకుంటుంది. ఆదిశంకరాచార్యులు ఈ గుడిలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి, అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపజేశారని చెబుతారు. పెళ్లికాని వారు కామాక్షి దేవిని దర్శిస్తే కళ్యాణ యోగం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.
Comments