సుశాంత్‌ను ఇద్దరు కలిసి చంపారు: సోదరి శ్వేతా సింగ్
2020లో జరిగిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై సోదరి శ్వేతా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, ఇద్దరు కలిసి హత్య చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని అమెరికా, ముంబైలోని ఇద్దరు సైకిక్స్ వేర్వేరుగా తనకు చెప్పారన్నారు. ‘సుశాంత్ బెడ్, ఫ్యాన్ మధ్య దూరాన్ని బట్టి అతను ఉరేసుకుని చనిపోయే అవకాశమే లేదు. మెడపై దుపట్టా మార్క్ కాకుండా ఒక చిన్న చెయిన్ ముద్ర మాత్రమే కనిపించింది’ అని పేర్కొన్నారు.








Comments