అంపైర్లపై నిర్ణయంపై శ్రీలంక ప్లేయర్లు ఫైర్..
శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు వివాదాలకు నిలయంగా మారింది. ఇప్పటికే టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, లంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య జరిగిన వాగ్వాదం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరి ఆటగాళ్ల తీరును పలువురు మాజీ క్రికెటర్లు సైతం వ్యతిరేకించారు. తాజాగా అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. శ్రీలంక బ్యాటర్ తన గ్లౌజులను విసిరేశాడు. ఈ ఘటన రెండో రోజు ఆట ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
భారత్ తొలి ఇన్నింగ్స్‌ను రెండో రోజు 503/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆటకు కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా.. కొలంబోలో వెలుతురు మందగించింది. ఈ నేపథ్యంలో అంపైర్లు లైట్ మీటర్‌తో వెలుతురును పరిశీలించారు. అయితే ఆటను నిలిపివేయకుండా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై శ్రీలంక బ్యాటర్లు జయసూర్య, కమీల్ మిశ్రా ఇద్దరూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ అంపైర్లు తమ నిర్ణయం ప్రకారమే ఆటను కొనసాగించారు.
ఈ క్రమంలో ఔటైన తర్వాత మైదానం వీడుతున్న సమయంలో ప్రభాత్ జయసూర్య పలుమార్లు అంపైర్ల వైపు కోపంగా చూస్తూ వెళ్లాడు. పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత కోపంతో తన గ్లౌజులను విసిరేశాడు. ఈ దృశ్యం మ్యాచ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కామెంట్రీ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ కూడా జయసూర్య తీవ్ర అసహనంలో ఉన్నాడని వ్యాఖ్యానించాడు.









Comments