• Aug 25, 2026
  • NPN Log

     

    ఏపీ వ్యాయామ విద్య పోరాట సమితి ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకుని సోమవారం శ్రీ శ్రీనివాస హై స్కూల్ లో జిల్లాస్థాయి క్రీడా పోటీలు మహిళలు పురుషులకు ఖోఖో, కబ్బడి, త్రోబాల్ పోటీలు వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.దేవేంద్ర గౌడ్ స్కూల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు MEO రామచంద్రుడు, SI డి వై స్వామి, నాగార్జున స్కూల్ అధినేత ఎద్దుల సూర్య రెడ్డి, ఎద్దుల సత్య రెడ్డి TDP పట్టణ, మండల కన్వీనర్లు రామకృష్ణ రెడ్డి, గంగాధర్ నాయుడు, సీనియర్ నాయకులు రవీంద్ర గౌడ్ AISF జిల్లా సహాయ కార్యదర్శి బి.రంగస్వామి పాల్గొని దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ  ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని  హాకీ మాంత్రికుడు ఒలంపిక్స్ లో ఏడు మెడల్స్ ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి  ఆయన పేరు మీదనే ఆగస్టు 29 క్రీడా దినోత్సవం  జరుపుకుంటారు విద్యార్థులు ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని   చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలు మంచి క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో మొట్ట మొదటి సారిగా శ్రీ శ్రీనివాస హై స్కూల్ లో కబడ్డీ ఖోఖో త్రోబాల్ బాల, బాలికలకు  క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని విద్యార్థుల్లో క్రమశిక్షణ శారీరక దారుఢ్యం  మానసిక ఒత్తిడి క్రీడా నైపుణ్యాలు  చదువుతో పాటు విద్యార్థులకు అవసరమని ఈ పోటీల్లో  ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా మా వంతు కృషి చేస్తామని  కోడుమూరు పీడీ అండ్ PD &PET s ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ డోన్ రణప్రతాప్ రెడ్డి, కోడుమూరు శ్రీ శ్రీనివాస హై స్కూల్ హెడ్ మాస్టర్ సురేంద్ర బాబు, కరస్పాండెంట్ లక్ష్మణ్, విశ్వనాథ్ గవర్నమెంట్ PETలు శివ, హరికృష్ణ మరియు అన్ని ప్రైవేట్ ప్రభుత్వ PD &PET s తదితరులు పాల్గొన్నారు...

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement