• Jul 27, 2026
  • NPN Log

    వానాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి తదితర సమస్యలు వేధిస్తుంటే... వెడల్పాటి గిన్నెలో వేటి నీటిని తీసుకుని నాలుగు చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి బాగా కలిపి పది నిమిషాలపాటు ముఖానికి ఆవిరి పట్టాలి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. చేతి రుమాలుపై రెండు చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి వాసన పీలుస్తుంటే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. చెంచా కొబ్బరి నూనె లేదా బాదం నూనెలో రెంచు చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి కలిపి దానితో మెల్లగా మర్దన చేస్తుంటే కండరాల నొప్పి, నడుం నొప్పి, భుజాల నొప్పి మాయమవుతాయి.

    రాత్రి పడుకునేముందు బకెట్‌ వేడినీటిలో నాలుగైదు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ను కలుపుకుని స్నానం చేస్తే అలసట తీరుతుంది.

    ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వెంటనే గాఢ నిద్ర ముంచుకొస్తుంది. చెంచా బాదం నూనెలో రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ వేసి కలిపి పాదాలకు రాస్తే పగుళ్లు, ఆనెలు తగ్గుతాయి.

    కొద్దిగా వేడిచేసిన చెంచా కొబ్బరినూనెలో రెండు చుక్కల పిప్పరమెంట్‌ ఆయిల్‌ కలిపి నుదుటికి పట్టిస్తే తలనొప్పి, సైనస్‌ సమస్యలు తగ్గుతాయి.

    పలుచని చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్‌పై రెండు చుక్కల రోజ్‌మేరీ ఆయిల్‌ వేసి వాసన చూస్తుంటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది.

    రెండు చెంచాల జోజోబా ఆయిల్‌ లేదంటే బాదం నూనెలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ వేసి కలపాలి. దూదిని ఈ మిశ్రమంలో ముంచి మొటిమలపై మెల్లగా అద్దుతుంటే రెండు రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.

    నాలుగు చెంచాల గోరు వెచ్చటి కొబ్బరి నూనెలో రెండు చుక్కల లెమన్‌ ఆయిల్‌ వేసి కలిపి శరీరానికి పట్టిస్తే హానికారక బ్యాక్టీరియాలు తొలగి దురదలు, దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలు తీరుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

    చెంచా తేనెలో రెండు చుక్కల చామంతి నూనె వేసి కలిపి ముఖానికి అప్లయ్‌ చేసి పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం పొడిబారడం, నల్లమచ్చలు, ట్యాన్‌ తొలగి ముఖం కాంతివంతంగా మారుతుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement