క్యారెట్ పాస్తా.. ఇలా చేస్తే ఆ రుచే వేరు..
కావలసిన పదార్థాలు: ఉడికించిన పాస్తా - ఒకటిన్నర కప్పు, క్యారట్ ముక్కలు - కప్పు, టమాటాలు - రెండు, ఉల్లి ముక్కలు - అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, కూరగాయలు ఉడికించిన నీళ్లు- కప్పు, మిర్యాల పొడి - పావు స్పూను, నూనె, ఉప్పు, ఒరెగానో- తగినంత, తాజా క్రీము - కప్పు.
తయారుచేసే విధానం: ఓ బాణలిలో కాస్త ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లి ముక్కలని వేయించాలి. అయిదు నిమిషాల తరవాత వెల్లుల్లి జత చేయాలి. ఘుమఘుమలాడుతుంటే క్యారెట్ ముక్కలు, టమాటాలు వేయాలి. ఉడికాక గరిటెతో మెత్తగా చేసి ఉప్పు, మిరియాల పొడి చేర్చి, స్టవ్ కట్టేయాలి. పూర్తిగా చల్లబడ్డాక మిక్సీలో వేసి, కూరగాయల నీళ్లని కలిపి మెత్తటి క్యారెట్ సాస్లా చేసుకోవాలి. ఓ పాన్లో ఈ సాస్ని కాస్త వేడి చేసి ఉడికిన పాస్తా వేయాలి. తాజా క్రీమును కూడా వేసి మొత్తం కలిపితే క్యారెట్ పాస్తా తయారు. పైన ఒరెగానోని చల్లడం మరచిపోకండి.









Comments