ఉరవకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు అక్కడికక్కడే మృతి
ఉరవకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు అక్కడికక్కడే మృతి
ఉరవకొండ (NPN వార్త):
ఉరవకొండ పట్టణ శివారులోని మైక్రో స్టేషన్ సమీపంలో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం బైక్ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను వజ్రకరూరు గ్రామానికి చెందిన జైనుల్లా, మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీలుగా పోలీసులు గుర్తించారు. కోర్టు సంబంధిత పని నిమిత్తం ఉరవకొండకు వచ్చిన వీరు, తిరిగి స్వగ్రామం వజ్రకరూరుకు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా మైక్రో స్టేషన్ వద్ద ఈ విపత్తు సంభవించింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమై పరారైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో వజ్రకరూరులో విషాదఛాయలు అలముకున్నాయి.










Comments