• Oct 24, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : ఆస్పత్రుల్లో రోగుల చికిత్స కోసం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాల్సిన వైద్య పరికరాలను మళ్లీ వాడొద్దంటూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్‌ యూజ్‌ వైద్య పరికరాలు, డిస్పోజబుల్‌ సర్జికల్‌ వస్తువులను స్టెరిలైజేషన్‌ పేరుతో శుభ్రం చేసి తిరిగి వినియోగిస్తున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో ఇకపై దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు సహా అన్ని వైద్య సంస్థల్లో ఇటువంటి పరికరాలను తిరిగి వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు కేంద్ర ఆరో గ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీహెచ్‌ఎస్‌) డైరెక్టర్‌ తాజాగా అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

    కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, కార్డియోథొరాసిక్‌ అండ్‌ వాస్క్యులర్‌ సర్జరీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల్లో ఒకసారి చికిత్సలో ఉపయోగించిన పరికరాలను స్టెరిలైజేషన్‌ చేసి మరోసారి వినియోగిస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. కొన్ని సందర్భాల్లో ఈ పరికరాలకు సంబంధించిన పూర్తి ఖర్చును సైతం రోగుల నుంచి వసూలు చేయడం, ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద రీయింబర్స్‌మెంట్‌ పొందడం జరుగుతోందని లేఖలో వెల్లడించింది. ఒక్కసారి మాత్రమే ఉపయోగించాల్సిన పరికరాలను తిరిగి వినియోగించడం రోగుల భద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరించింది.

    దీంతో ఒక రోగి నుంచి మరొకరికి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొం ది. ఈ విషయంలో రాష్ట్రాల ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, ఆరోగ్య సేవల సంచాలకులు, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, రాష్ట్రాల డ్రగ్‌ కంట్రోలర్లు పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది. ఆస్పత్రుల్లో అవసరమైన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement