• Oct 24, 2026
  • NPN Log

    విజయవాడ : విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఇప్పటికే సిట్‌ నుంచి కేసుకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు శుక్రవారం రాత్రి చేరుకున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కొద్దిరోజుల క్రితం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం పదిమంది అధికారులు, సిబ్బంది హైదరాబాద్‌ నుంచి పోలీసు స్టేషన్‌కు రెండు వాహనాల్లో చేరుకున్నారు. పోలీసు స్టేషన్‌ రెండో అంతస్తులో ఉన్న సీసీఎస్‌ విభాగంలో విచారణ చేపట్టారు. స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని దఫదఫాలుగా పిలిపించుకుని విచారించారు. ఈ ఏడాది మే నెలలో మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చింది మొదలు అతని మరణం వరకు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సాయికృష్ణ ఎన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు....ఎన్ని నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయన్న వివరాలు సీసీఎస్‌ నుంచి తీసుకున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో లోపలకు ఇతరులు ఎవరినీ రానివ్వలేదు. స్టేషన్‌ సిబ్బందిని బయటకు పంపలేదు. తొలుత స్టేషన్‌లో విచారణ పూర్తి చేసుకుని, తర్వాత సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జరిగిన ఘటనపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కాపీని ఇన్‌ఛార్జిగా ఉన్న నాలుగో ఏజేఎంఎ్‌ఫసీ కోర్టులో శుక్రవారం అందజేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇన్‌స్పెక్టర్‌ (సస్పెండెడ్‌) నాగరాజు స్నేహితుడు గులివిందల సురేశ్‌కుమార్‌(ఏ4), పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాల టెక్నీషియన్‌ కోనేటి వెంకటరాజు(ఏ7) ఇళ్లలో సోదాలు చేయడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి కోర్టు అనుమతిని మంజూరు చేసింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement