మెడిసిన్‌లో పీజీ పూర్తి చేసిన తొలి ట్రాన్స్‌జెండర్ రూత్ జాన్‌పాల్
ఖమ్మం : ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యామైనా సాధించవచ్చని నిరూపించారు డాక్టర్ కొయ్యల రూత్ జాన్‌పాల్. పేదరికాన్ని, సమాజంలో ఎదురైనా అవమానాలను జయించి.. వైద్య విద్యలో పీజీ పూర్తి చేయడం ద్వారా దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా సత్తా చాటారు. తాజాగా విడుదలైన డీఎంఎస్ వైద్య పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించారు.
వైద్య విద్యలో తనదైన ముద్ర వేసిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఖమ్మం నగరంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన నిరుపేద దళిత కుటుంబంలో పుట్టినరూత్ జాన్ పాల్.. ఎన్నో కష్టనష్టాలు, అవమానాలు ఎదుర్కొంటూ చదువు కొనసాగించారు. స్థానికంగానే పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. అనంతరం వైద్యవిద్యపై ఉన్న ఆసక్తితో జిల్లాకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ కేవీ కృష్ణారావు తదితరుల సహకారంతో హైదరాబాద్‌లో ఎంసెట్ కోచింగ్ తీసుకుని ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఈఎ్‌సఐ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంలో పీజీ కోర్సులో చేరి విజయవంతంగా పూర్తి చేశారు.








Comments