• Jul 28, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: కోర్టు విచారణల వీడియోలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు వీడియోలను అనుమతి లేకుండా సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేయడంపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. కోర్టు విచారణలకు సంబంధించిన వీడియోలను ముందస్తు అనుమతి లేకుండా పోస్ట్ చేయడం, ఎడిట్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, తిరిగి షేర్ చేయడం (రీ-పోస్ట్), మానిటైజ్ చేయడం నిషేధం. కోర్టు రికార్డింగ్‌లను అనుమతి లేకుండా భద్రపరచడం లేదా ప్రసారం చేయడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణించనుంది.

    అయితే, మీడియా సంస్థలకు మాత్రం కోర్టు కేసులపై రిపోర్టింగ్ చేయడంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన వార్తా సంస్థల రిపోర్టింగ్ హక్కులకు ఎలాంటి భంగం కలగదని పేర్కొంది. కోర్టు విచారణలకు సంబంధించిన వార్తలను మీడియా సంస్థలు యథావిధిగా ప్రజలకు అందించవచ్చని తెలిపింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement