• Aug 25, 2026
  • NPN Log

    బీటా థలస్సీమియా మేజర్‌తో పోరాడిన సాకేత్ కొల్లా స్మారకార్థం ఏర్పాటు చేసిన సాకేత్ ఫౌండేషన్ సారథ్యంలో 15వ వార్షిక 5కే వాక్ శనివారం ఫ్రిస్కో కామన్స్ పార్కులో జరిగింది. ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు అందజేశారు. ఈ వాక్ ద్వారా ₹15లక్షలు($16వేల డాలర్లు) అందాయని సాకేత్ తల్లిదండ్రులు శ్రీనివాస్, లక్ష్మి తెలిపారు. సాకేత్ స్ఫూర్తిని స్మరించుకుంటూ, భారతదేశంలోని ఆర్థికంగా వెనుకబడిన పిల్లల ఆరోగ్యం, విద్య కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు: www.sakethfoundation.org చూడవచ్చు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement