• Jul 27, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడం భారత్‌లో ప్రధాన సమస్యగా మారింది. పక్షవాతం, గుండె జబ్బులకు ఈ చెడు కొలెస్ట్రాలే ప్రధాన కారణం. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో ప్రతి 10 మందిలో 9 మంది (90 శాతం) వయోజనులు ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. రక్తంలో కొలెస్ట్రాల్‌ లేదా ట్రైగ్లిజరైడ్ల సమతుల్యత దెబ్బతినడాన్ని వైద్య పరిభాషలో డిస్లిపిడెమియా అంటారు. దేశవ్యాప్తంగా 23,665 మంది వయోజనుల సమాచారాన్ని విశ్లేషించిన ఐసీఎంఆర్‌-ఐఎన్‌డీఐఏబీ సుమారు 90ు మంది డిస్లిపిడెమియాతో బాధపడుతున్నట్టు గుర్తించింది. దీనికి ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు కానీ.. దీని వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. సాధారణ లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షల ద్వారా సకాలంలో వ్యాధి నిర్ధారణ చేయడం, అవసరమైతే మందులు వాడ డం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి చర్యలు ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 66.8ుమందిలో మంచి కొలెస్ట్రాల్‌ అయిన హెచ్‌డీఎల్‌ స్థాయిలు తక్కువగా కనిపించాయి. 49.4ు మందిలో చెడు కొలెస్ట్రాల్‌ అయిన ఎల్‌డీఎల్‌ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. 29.5ు మందిలో ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలు ఉన్నట్టు గుర్తించారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్న వారిలోనూ ఈ సమస్య అధికంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement