గాంధీ పేరు పలికితేనే మోదీ, షాలకు ఉలికిపాటు
హైదరాబాద్ : మహాత్మాగాంధీ పేరు పలికితేనే మోదీ, షా ఉలిక్కిపడుతున్నారని, అందుకే ఉపాధిపథకం పేరు మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఆరోపించారు. పథకానికి పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన నిర్వహించారు. తాము అధికారంలోకి రాగానే పథకానికి మళ్లీ గాంధీ పేరుపెడతామని మహేశ్ చెప్పారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. కేంద్రం గాంధీ పేరును తొలగిస్తే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికి పోయారని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పేదల కడుపు నింపేందుకు తెచ్చిన ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. మంత్రి శ్రీహరి మాట్లాడతూ గాంధీ పేరును తొలగించడంతో ప్రతి భారతీయుడి హృదయం తల్లడిల్లిందన్నారు. మంత్రులు వివేక్, అజారుద్దీన్ పాల్గొన్నారు.









Comments