విమానంలో పొగతాగిన పాక్ హాకీ మేనేజర్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ హాకీ జట్టు మేనేజర్ అంజుం సయ్యద్ విమానంలో పొగతాగుతూ పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో అతడితోపాటు జట్టు మొత్తాన్నీ మధ్యలోనే విమానం నుంచి దించేశారు. అర్జెంటీనాలో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో పాల్గొన్న పాక్ హాకీ జట్టు స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. అయితే, మార్గమధ్యంలో ఇంధనం నింపుకొనేందుకు విమానాన్ని బ్రెజిల్‌లోని రియో డి జనిరో ఎయిర్‌పోర్ట్‌లో ఆపారు. ఈ సమయంలో అంజుం పొగతాగుతూ పట్టుబడ్డాడు. దీంతో అతడితోపాటు జట్టు మొత్తాన్ని విమానం నుంచి దించేశారు. 1992 ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరిన పాక్ జట్టులో అంజుం సభ్యుడు.







Comments