సెమీస్లో సాత్విక్ జోడీ ఓటమి
హాంగ్జౌ: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి నాకౌట్‌లో అదే తరహా ప్రదర్శన చేయలేక పోయింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ సాత్విక్-చిరాగ్ జంట 21-10, 17-21, 13-21తో చైనాకు చెందిన లియాంగ్ వి కెంగ్-వాంగ్ చాంగ్ చేతిలో పరాజయం పాలైంది.








Comments