జూన్ కల్లా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం: సీఎం
ఆంధ్ర ప్రదేశ్ : జనవరి 26 నాటికి రోడ్లపై చెత్త కనిపించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్ కల్లా ఆంధ్ర ప్రదేశ్ ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. ప్రజల్లోనూ సామాజిక స్పృహ రావాలని, ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయొద్దని సూచించారు. అనకాపల్లి(D) తాళ్లపాలెంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 10లక్షల గృహాలు, పట్టణాల్లో 5లక్షల ఇళ్లలో కంపోస్టు తయారీ తమ లక్ష్యమన్నారు.










Comments