టీవీ ప్రకటనలపై పరిమితులు ఎత్తివేత
న్యూఢిల్లీ : టీవీల్లో ప్రకటనలపై ఉన్న పరిమితులను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం గంట వ్యవధిలో కేవలం 12 నిమిషాలపాటే ప్రకటనలు ప్రసారం చేయాలన్న నిబంధన ఉండగా, దాన్ని తొలగిస్తూ శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. టీవీ ఛానెళ్ల మధ్య న్యాయమైన పోటీ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచార, ప్రసార శాఖ తెలిపింది. ‘పే ఛానెల్’, ‘ఫ్రీ టు ఎయిర్ ఛానెల్’ ఏదయినప్పటికీ అన్నీ ప్రకటనలపైనే ఆధారపడ్డాయని పేర్కొంది. టీవీ ఛానెళ్ల మధ్యతో పాటు, టీవీ ఛానెళ్లు-డిజిటల్ మీడియా మధ్య కూడా పోటీ నెలకొన్న నేపథ్యంలో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రకటనలపై పరిమితులను తొలగించినట్టు తెలిపింది. ఇందుకోసం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్-1994ను సవరిస్తామని, వాటిని గెజిట్లో ప్రచురించిన నాటి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.










Comments