త్వరితగతిన సమస్యలు పరిష్కరించండి: ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక'కు 84 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లోన్ల పేరిట మోసాలు, భూ సమస్యలు, నకిలీ పత్రాల సృష్టి, వృద్ధుడైన తండ్రిని నిర్లక్ష్యం చేసిన పిల్లలపై ఫిర్యాదులు అందాయి. వీటిపై తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో సీఐలు శివశంకర్, రమేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు.









Comments