అన్నను చంపిన వదినపై పగ.. రోకలిబండతో కొట్టి చంపిన మరిది
ఆస్పరి: మండలంలోని తొగలగల్లు గ్రామంలో పాత కక్షలు ప్రాణం తీశాయి. గతంలో ప్రియుడి మోజులో పడి తన అన్నను చంపిన వదిన గంగమ్మపై మరిది గొల్ల పెద్దయ్య కక్ష పెంచుకున్నాడు. మా అన్నను చంపిన వదినను వదలకూడదనే కసితో, నిన్న రాత్రి ఆమెపై రోకలిబండతో దారుణంగా దాడి చేసి హతమార్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన గ్రామంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.








Comments