త్వరలో కొత్త సర్పంచులతో సీఎం సమావేశం
తెలంగాణ : కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఇవాళ తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండగా ఈ నెల 20న సర్పంచుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం, సంస్థాగతంగా కాంగ్రెస్ క్యాడర్ను బలోపేతం చేయడంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.










Comments