న్యూ విశ్వ వాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కోడుమూరు పట్టణంలోని న్యూ విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఖలీల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ ఖలీల్, గిడ్డయ్య , శ్రీనివాసులు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలు, త్యాగాలను ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాధర్, రాము, కల్పన, రెహానా, నజ్రిన్ , భారతి, మహేశ్వరి బాబయ్య తదితరులు,పాల్గొన్నారు.








Comments