• Oct 24, 2026
  • NPN Log

    ఎలాన్ మస్క్‌కు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్‌లింక్’ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ, దీని భద్రత, డేటా ప్రైవసీపై అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతరిక్షంలో ఉండే వేలాది శాటిలైట్లు లేజర్ కమ్యూనికేషన్ ద్వారా ఒకదానితో ఒకటి సమాచారాన్ని వేగంగా మార్పిడి చేసుకునే సాంకేతికతపై ఇవి పనిచేస్తాయి. సరిహద్దులతో సంబంధం లేకుండా నేరుగా నింగి నుంచే సిగ్నల్స్ ప్రసారమయ్యే ఈ వ్యవస్థ వల్ల సాంప్రదాయ కమ్యూనికేషన్ వ్యవస్థల కంటే సైబర్ భద్రత, జాతీయ భద్రతకు పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    భారత్, పాకిస్తాన్ పరిధిలో సేవలు.. డేటా భద్రతపై అసలైన అనుమానాలు:

    దక్షిణాసియా ప్రాంతంలోనూ స్టార్‌లింక్ (Starlink Security)తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తుండటంతో, భారత్ మాత్రమే కాకుండా సరిహద్దు దేశమైన పాకిస్తాన్‌లోనూ ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉపగ్రహాలు నిరంతరం అంతరిక్షంలో ఒకదానికొకటి డేటాను బదిలీ చేసుకునే క్రమంలో ఒక దేశపు సున్నితమైన సమాచారం మరొక దేశం చేతుల్లోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన సరిహద్దు ప్రాంతాల నుంచి సేకరించే డేటా లీక్ అయితే జాతీయ భద్రతకే ముప్పు వాటిల్లుతుందనే చర్చ మొదలైంది.

     

    డేటా లోకలైజేషన్, విదేశీ నిఘా భయాలు:

    ఒకవేళ భారత వినియోగదారులకు చెందిన సున్నితమైన సమాచారము, లొకేషన్ వివరాలు లేదా నెట్‌వర్క్ ట్రాఫిక్ నిఘా డేటా.. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా పాకిస్తాన్ లేదా ఇతర శత్రు దేశాలకు, లేదా విదేశీ నిఘా సంస్థల చేతుల్లోకి వెళితే పరిస్థితి అత్యంత తీవ్రంగా మారుతుంది. స్థానిక గ్రౌండ్ స్టేషన్ల నియంత్రణ పూర్తిస్థాయిలో లేకపోవడం, గ్లోబల్ డేటా రౌటింగ్ కారణంగా దేశద్రోహ శక్తులు, ఉగ్రవాద మూకలు ఈ నెట్‌వర్క్‌ను గుట్టుచప్పుడు కాకుండా వినియోగించుకునే అవకాశాలున్నాయని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

    సార్వభౌమాధికారానికి ముప్పు.. భారత్ కఠిన నిబంధనలు:

    ఈ తరహా తీవ్రమైన సవాలు తలెత్తకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం స్టార్‌లింక్ సేవలకు స్పెక్ట్రమ్ లేదా లైసెన్స్ ఇచ్చే ముందే కఠినమైన ‘డేటా లోకలైజేషన్’, ‘లాఫుల్ ఇంటర్‌సెప్షన్’ నిబంధనలను విధిస్తోంది. భారత వినియోగదారుల డేటా పూర్తిగా భారత్‌లోని లోకల్ సర్వర్లు, లోకల్ గేట్‌వేల ద్వారానే ప్రాసెస్ అవ్వాలని స్పష్టం చేస్తోంది. దేశ సార్వభౌమాధికారం, భద్రత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా, శాటిలైట్ సేవలకు స్పష్టమైన భద్రతా మార్గదర్శకాలు అమలు చేయడమే దీనికి ఏకైక పరిష్కారమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement