• Oct 24, 2026
  • NPN Log

    పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో ఈ రబీ సీజన్‌లో 22 శాతం సాగు నీటి కొరత ఉంటుందని పాకిస్థాన్ ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ఐఆర్ఎస్ఏ) వెల్లడించింది. దీంతో గోధుమ, బార్లీ, శనగ పంటల సాగులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. మరోవైపు పాకిస్థాన్ నీటి కొరతకు భారత్ కారణమంటూ అక్కడి ప్రభుత్వం తరచూ ఆరోపిస్తున్న వేళ.. ఈ కొరతకు కారణం పాకిస్థాన్ సొంత చర్యలేనని ఆ దేశ అధికారిక సంస్థ ఐఆర్ఎస్ఏ పేర్కొన్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో 2025లో ఈ ఒప్పందం రద్దయింది. అప్పటి నుంచి తమ దేశంలో నీటి కొరతను చూపిస్తూ భారత్‌ను పాక్ నిందిస్తోంది. అయితే ఈ నీటి కొరతకు కారణం పాకిస్థానే అని ఐఆర్ఎస్ఏ వెల్లడించిందని ఆ దేశ పత్రిక కథనం ప్రచురించింది. పలు హైడ్రోప్రాజెక్ట్‌ల నిర్మాణంలో పాకిస్థాన్ జాప్యం చేయడం దీనికి ప్రధాన కారణమని ఆ ప్రభుత్వ సంస్థ చెప్పిందట. అలాగే నదుల్లో ప్రవాహం తగ్గటం, దేశంలో జలశయాలు తక్కువగా ఉండటం లాంటివి ఇతర కారణాలుగా చూపిందని ఆ పత్రిక పేర్కొంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement