• Oct 24, 2026
  • NPN Log

    పనామా దేశంలో సోమవారం తీవ్ర భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. 35 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. కాగా గత శుక్రవారం పనామాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని కారణంగా వందలాది నివాస సముదాయాలు ధ్వంసమయ్యాయి. సుమారు 900 భవనాలు కూలిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భూకంపం తరువాత అక్కడ దాదాపు 300 ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సహాయక చర్యలు ప్రారంభించింది. పనామాలోని లాస్ శాంటోస్, కోక్లే, హెర్రెరా ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement