పార్టీ ఆఫీస్లో టీఎంసీ నేత, మాజీ మంత్రి ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!
కోల్‌కతా/బీర్భూమ్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ (75) బీర్భూమ్ జిల్లాలోని తన నివాసం సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ ఉదయం (ఆదివారం) ఉదయం మృతి చెంది కనిపించారు.
సూసైడ్ నోట్ లభ్యం
ఘటనా స్థలంలో ఒక లేఖ (సూసైడ్ నోట్) లభ్యమైంది. రాంపూర్ హాట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆశిష్ బెనర్జీకి రాజకీయాల్లో అవినీతి మరకలు లేని నాయకుడిగా మంచి పేరుంది. లేఖలో ఏముందంటే.. 'నాకు ఎలాంటి అవినీతితోనూ సంబంధం లేదు. నన్ను తీవ్రంగా మానసిక వేదనకు గురిచేసి, నా ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు ఆరోపణలు చేశారు' అని ఆ నోట్‌లో రాసి ఉన్నట్లు తెలిసింది. గతంలో ఆయన తారాపీఠ్ రాంపూర్ హాట్ అభివృద్ధి అథారిటీ (TRDA) ఛైర్మన్‌గా వ్యవహరించిన సమయంలో చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై పత్రికలు, రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రచారంపై ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం.
రాజకీయ జీవితం
ఆశిష్ బెనర్జీ బీర్భూమ్ జిల్లా నుంచి ఐదుసార్లు శాసనసభ్యుడిగా (MLA) గెలుపొందారు. 2021 నుంచి 2026 వరకు పశ్చిమ బెంగాల్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సేవలు అందించారు. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి ధ్రువ సాహా చేతిలో ఓటమి పాలయ్యారు.
రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి, ఆరోపణలు
ఆశిష్ బెనర్జీ హఠాన్మరణంపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఈ ఘటనపై స్పందిస్తూ 'పత్రికారంగం, రాజకీయం రెండింటికీ కొన్ని సరిహద్దులు ఉంటాయని నమ్మే ప్రతి ఒక్కరి మనస్సాక్షిని ఈ ఘటన తీవ్రంగా కలచివేస్తుంది. రాజకీయ స్వార్థం కోసం తప్పుడు ప్రచారాలు చేసిన వారు ఒక మనిషి ప్రాణాలమీదకు తెచ్చిన తీవ్రమైన పర్యవసానాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి' అని ఆయన సోషల్ మీడియా మాధ్యమం 'X' లో పేర్కొన్నారు.
ఆశిష్ బెనర్జీ మృతదేహాన్ని స్వాధీనం చే








Comments