• Oct 24, 2026
  • NPN Log

    వడోదర: జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో భారత్‌ ఘనంగా బోణీ చేసింది. బౌలింగ్‌లో స్పిన్నర్‌ శ్రీచరణి (4/23) కెరీర్‌ బెస్ట్‌తో ఆకట్టుకోగా.. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ ప్రతీకా రావల్‌ (96 బంతుల్లో 15 ఫోర్లతో 100 నాటౌట్‌) అజేయ శతకంతో రాణించింది. దీంతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో మంధాన సేన 9 వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే ఈ సిరీ్‌సలో 1-0 ఆధిక్యంతో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 197 పరుగులకే కుప్పకూలింది. బిజా (62), మవుంగ (29), ముపచిక్వ (25) మాత్రమే రాణించారు. ఆరంభం నుంచే భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే పరుగుల కోసం చెమటోడ్చింది. పేసర్‌ క్రాంతి గౌడ్‌ మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 27.1 ఓవర్లలో 200/1 స్కోరు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, మంధాన (32) ఫర్వాలేదనిపించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ప్రతీకా రావల్‌ నిలిచింది.

     

    శతక భాగస్వామ్యం: వన్డే వరల్డ్‌కప్‌ మాదిరి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ప్రతీకా రావల్‌ ఛేదనలో అదరగొట్టింది. తొలి ఓవర్‌ నుంచే బౌండరీలు బాదేస్తూ స్కోరును చకచకా పెంచేసింది. మంధానతో కలిసి తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించింది. ఇక వన్‌డౌన్‌లో షఫాలీ రాకతో పరుగుల వేగం మరింతగా పెరిగింది. 26వ ఓవర్‌లో మూడు సిక్సర్లతో 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసింది. ఇక ప్రతీకా రెండు వరుస ఫోర్లతో వన్డేల్లో తన మూడో సెంచరీని అందుకోగా.. 28వ ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌గా మలిచిన షఫాలీ మ్యాచ్‌ను ముగించింది. ఈ జోడీ మధ్య రెండో వికెట్‌కు అజేయంగా 106 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

    సంక్షిప్త స్కోర్లు

    జింబాబ్వే: 49.5 ఓవర్లలో 197 ఆలౌట్‌ (బిజా 62, మవుంగ 29; శ్రీచరణి 4/23, క్రాంతి 3/42, దీప్తి 2/44). భారత్‌: 27.1 ఓవర్లలో 200/1 (ప్రతీకా 100 నాటౌట్‌, షఫాలీ 64 నాటౌట్‌, మంధాన 32; చారె 1/58).

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement