'ప్రత్యేక మిత్రుల'తో మోదీ ముచ్చట!
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఒక ఆసక్తికరమైన, హృదయానికి హత్తుకునే సన్నివేశం బయటకొచ్చింది. ఎర్రకోట (లాల్ ఖిల్లా) వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగించే ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో నెలకొన్న ఒక ఆహ్లాదకరమైన ఘట్టాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
నన్ను కలవడానికి వచ్చాయి!
ప్రతిరోజూ ఉదయాన్నే తన నివాసంలోని మూగజీవాలు, పశువులకు మేత తినిపించడం ప్రధాని మోదీకి అలవాటు. అయితే ఆగస్టు 15న ఎర్రకోట వద్ద వేడుకల కోసం ఆయన ఉదయాన్నే బయలుదేరాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన అనుభవాన్ని ప్రధాని ఇన్స్టాగ్రామ్లో గుర్తుచేసుకుంటూ 'రోజూ ఉదయం నా మిత్రులకు (జంతువులకు) మేత తినిపించడం నా దినచర్య. కానీ నిన్న ఉదయం నేను త్వరగా బయలుదేరుతున్నానని గ్రహించి కాబోలు.. నేను ఎర్రకోటకు వెళ్లేముందు నన్ను కలవడానికి వచ్చాయి' అని పేర్కొన్నారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ 'Special, as always!' అని ముగించారు.








Comments