• Apr 30, 2026
  • NPN Log

    తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి గ్రామీణ మండలం అడపారెడ్డి పల్లిలో దారణం జరిగింది. భూ వివాదం కారణంగా అమర్‌నాథ్ రెడ్డి అనే వ్యక్తిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బొమ్మి రాహుల్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అడపారెడ్డి పల్లికి చెందిన నిందితుడు రాహుల్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు.

    అప్పటికే అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యతో అమర్‌నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. బొమ్మ రాహుల్ రెడ్డి ఇంటితోపాటు అతడి బైక్‌కు మృతుడి బంధువులు నిప్పు పెట్టారు. దాంతో అడపారెడ్డి పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎం.ఆర్.పల్లి పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).