మమ్మల్ని తిరిగి భారత్‌కు పంపించేయండి
దళారుల మాయమాటలు నమ్మి ఉద్యోగాల ఆశతో ఒమాన్‌కు వచ్చి ఇరుక్కుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలుగు మహిళలతో పాటు కొందరు భారతీయ మహిళలు.. తమను స్వదేశానికి పంపించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని భారత రాయబారి ఎల్. ప్రశాంత్ పిసేను కోరారు. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన కోల గంగోజమ్మ, కోనసీమ జిల్లాకు చెందిన గురుజుల కుమారి, హైదరాబాద్‌కు చెందిన షబానా బేగంతో పాటు మరో 140 మంది మహిళలు ఉద్యోగాల కోసం పరాయి దేశానికి వచ్చి మోసపోయి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు కొంతకాలంగా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నిత్యం అధికారులు చేస్తున్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తున్న ఎంతో మంది భారతీయ మహిళలు దళారుల మోసాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి ప్రవాస భారతీయులతో సమావేశమైన ప్రశాంత్ పిసే వారి సాధక బాధకాలనీ సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా వారంతా తమను స్వదేశానికి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని భారత రాయబారి ప్రశాంత్ పిసేకు మొరపెట్టుకున్నారు. సునాయాసంగా లభించే వీసాలతో అనేక మంది అక్రమ మార్గంలో ఒమాన్‌కు వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారని, తెలుగు వారితో సహా కొన్ని భారతీయ వ్యవస్థీకృత ముఠాలు మహిళలను ఇళ్లలో పనులు చేసే ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.










Comments