• Dec 16, 2025
  • NPN Log

    హైదరాబాద్ : పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. షాహీన్ నగర్‌లో 32 ఏళ్ల రౌడీ షీటర్ అమీర్‌ను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి.. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అమీర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి.. మరణించాడు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. అమీర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


    గతంలో ముబారక్ షికారీ అనే వ్యక్తి హత్య కేసులో రౌడీ షీటర్ అమీర్ ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం వద్ద లభించిన కత్తిని పహాడీ షరీఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పాత హత్యల కారణంగానే.. ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ హత్యపై సమాచారం అందుకున్న అమీర్ కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).