కొత్త కానిస్టేబుళ్లతో నేడు సీఎం సమావేశం
ఆంధ్ర ప్రదేశ్ : కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం నియామక పత్రాలు అందించనున్నారు. మంగళగిరి APSP ఆరోబెటాలియన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అభ్యర్థులతో సమావేశమై కాసేపు ముచ్చటిస్తారు. ఈ నెల 22 నుంచి 9 నెలల పాటు వారికి ట్రైనింగ్ ఉంటుంది. 2022 నవంబర్ లో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అన్ని టెస్టులను దాటుకుని 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు.








Comments