విద్యార్థులకు నోట్‌బుక్స్, విద్యా సామగ్రి పంపిణీ చేసిన సానా సతీష్ బాబు ఫౌండేషన్
రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఇచ్చిన వినూత్న పిలుపుకు విశేష స్పందన లభించింది. తనను కలిసేందుకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూల బొకేలకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ తీసుకురావాలని కోరగా, పెద్ద ఎత్తున విద్యా సామగ్రి అందింది.
ఆ సామగ్రిని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దశలవారీగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే రూ.50 వేల విలువైన 3,000 నోట్‌బుక్స్‌తో పాటు ఇతర విద్యా సామగ్రిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయగా, తాజాగా కరప గురుకుల పాఠశాల విద్యార్థులకు మరో 1,000 నోట్‌బుక్స్, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
అంతేకాకుండా విద్యార్థుల టీ-షర్టుల కొనుగోలు, ఇతర అత్యవసర అవసరాల కోసం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని కూడా ఫౌండేషన్ ప్రకటించింది.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, "పూల బొకేలు క్షణికానందాన్ని ఇస్తాయి.. కానీ ఒక నోట్‌బుక్ విద్యార్థి భవిష్యత్తుకు పునాది వేస్తుంది" అనే ఆలోచనతో ఎంపీ సానా సతీష్ బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఎంపీ కార్యాలయ ఇన్చార్జి మేకా లక్ష్మణమూర్తి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు దేవు వెంకన్న, కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి నారాయణ (తాతీలు), ఫౌండేషన్ సభ్యులు ముమ్మిడి వెంకటేశ్వరరావు, ఎంపీ కార్యాలయ సిబ్బంది సురేష్ తదితరులు పాల్గొన్నారు.










Comments