• Aug 25, 2026
  • NPN Log

    వివో లవర్స్ కోసం సరికొత్త ఫోన్ రాబోతుంది. భారత మార్కెట్లో సరసమైన ధరలో భారీ బ్యాటరీ, కెమెరా సెటప్‌తో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ప్రస్తుతం పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ ధరల మధ్య కంపెనీ సరసమైన ధరలో ఫోన్ తీసుకువస్తోంది. అయితే, ఈ బ్రాండ్ ఫోన్ ఏంటి అనేది ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ Y31 సిరీస్‌కు అప్ గ్రేడ్ కావచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

    ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సరసమైన Y-సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. వివో Y31T పేరుతో రానుంది. నివేదిక ప్రకారం ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ ఉండొచ్చు. ఈ ఫోన్ ఫొటోను కూడా కంపెనీ షేర్ చేసింది.

    ఇందులో నెక్స్ట్-జనరేషన్ స్పెసిఫికేషన్లు ఉంటాయని అంచనా. 7200mAh భారీ బ్యాటరీ, 1250 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 6.75-అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే ప్యానెల్‌తో వస్తుందని అంచనా. రాబోయే ఈ వివో Y31లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ లేదా 6GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుందని అంచనా.

     

     

    కెమెరా విషయానికి వస్తే.. :
    రాబోయే ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా. 2MP సెకండరీ సెన్సార్ కూడా ఉండొచ్చు. అలాగే, 7200mAh భారీ బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్ ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్‌ కూడా సపోర్ట్ చేస్తుంది.

     

     

     

    8.39mm మందం, IP68 రేటింగ్ ఉండొచ్చు. ఈ ఫోన్‌‌ను డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే, భారత మార్కెట్లో ముందుగా వివో ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. గ్రీన్, రెడ్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభించవచ్చు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement