• Aug 25, 2026
  • NPN Log

    హైదరాబాద్‌: అమెరికాకు చెందిన ప్రముఖ డీప్‌టెక్‌, ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ సంస్థ క్లౌడ్‌యాంగిల్స్‌.. హైదరాబాద్‌లో తమ గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ సెంటర్‌(జీఈసీ)ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లకు అవసరమైన అత్యాఽఽధునిక సాంకేతిక పరిష్కారాలను అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని.. వచ్చే రెండేళ్లలో దాదాపు 1,000 మంది ఇంజనీర్లకు పెంచుతూ సామర్థ్యాన్ని మరింత విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కేంద్రం ద్వారా డిజిటల్‌ టెక్నాలజీ, అప్లికేషన్‌ డెవల్‌పమెంట్‌, ఇంజనీరింగ్‌, డేటా అండ్‌ అనలిటిక్స్‌, ఏఐ, ఆటోమేషన్‌, డిజిటల్‌ ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్‌, కార్పొరేట్‌ సిస్టమ్స్‌ వంటి విభాగాల్లో క్లౌడ్‌యాంగిల్స్‌ సేవలను అందించనుంది. ఈ నెల 11న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఈ జీఈసీని ప్రారంభించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement