హీరోయిన్ ఈషాతో తరుణ్ భాస్కర్ పెళ్లి?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారినట్లు సినీ వర్గాల్లో టాక్. ఇద్దరూ వరంగల్‌కు చెందిన వారే కావడం గమనార్హం. కాగా తరుణ్‌కి ఇప్పటికే పెళ్లి కాగా, మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం.










Comments