28కేసులపై 23న ప్రివిలేజ్ కమిటీ విచారణ
ఆంధ్ర ప్రదేశ్ : శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఈనెల 23న సమావేశం నిర్వహించనుంది. రాష్ట్రంలో తమ హక్కులకు భంగం కలిగిన ఘటనలపై శాసనసభ్యులు అందించిన ఫిర్యాదులతో పాటు సభ నుంచి అందిన ప్రతిపాదనలపై కమిటీ విచారించనుంది. వీటికి సంబంధించి బాధ్యులైన అధికారులను సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు అందించినట్లు కమిటీ అధ్యక్షుడు బి.టి.నాయుడు పేర్కొన్నారు. 28 కేసులపై చర్చించనున్నట్లు తెలిపారు.










Comments