ఇంట్లోనే మానిక్యూర్ చేసుకోవచ్చు
అందంగా, ఆరోగ్యంగా ఉండే గోళ్ల కోసం మానిక్యూర్ చేసుకోవడం తప్పనిసరి. దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. ముందుగా పాత నెయిల్ పాలిష్‌ని తొలగించాలి. తర్వాత గోళ్లను షేప్ చేసుకొని గోరువెచ్చటి నీటిలో షాంపూ, నిమ్మరసం కలిపి దాంట్లో చేతులు ఉంచాలి. తర్వాత చేతులను స్క్రబ్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చివరిగా మీకు నచ్చిన నెయిల్ పాలిష్ వేస్తే సరిపోతుంది. లేత రంగులు వేస్తే గోళ్లు సహజంగా అందంగా కనిపిస్తాయి.









Comments