రెండేళ్ల నిరీక్షణకు ఫలితం
రెండేళ్ల విరామం తర్వాత భారత T20 జట్టులోకి ఇషాన్ కిషన్ తిరిగి వచ్చారు. 2026 T20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. 2023 నవంబర్ తర్వాత జాతీయ టీంలో కనిపించని ఇషాన్, దేశవాళీ క్రికెట్లో అదరగొట్టారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో 517 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి, ఝార్ఖండ్‌కు కప్ అందించారు. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న వరల్డ్‌కప్‌లో ఇషాన్ ఆట కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.








Comments