72 ఏళ్లలో తొలిసారి..
తాష్కెంట్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కు తొలి పతకం ఖరారైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మిక్స్డ్ విభాగం పోరులో భారత జోడీ హర్మీత్ దేశాయి/యశస్విని ఘోర్పడే సెమీఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. క్వార్టర్స్‌లో హర్మీత్ జంట 3-2తో దక్షిణ కొరియా జోడీ పార్క్ గంగెయోన్/లీ డేన్ను ఓడించింది. దీంతో 72 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీ మిక్స్డ్ డబుల్స్‌లో భారత జంటకు పతకం దక్కనుంది.










Comments