సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని, టీడీపీ నాయకులు
క్రైస్తవ సోదరులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అమిలినేనిక్రైస్తవ సోదరులు, టీడీపీ నాయకులతో కలసి క్రిస్మస్ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే
అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని సీ అండ్ ఐజీ చర్చి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకుల ఆహ్వానం మేరకు స్థానిక మండల పార్టీ నాయకులతో కలసి సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారికి గజమాలతో ఘన స్వాగతం పలికారు..మండల కేంద్రానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమిలినేని గారు ముందుగా ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థపకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.. అనంతరం సీ అండ్ ఐజీ చర్చిలో జరిగిన సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు, అందులో భాగంగా మా ఇంట్లో పిల్లలతో కలసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటాం.. అందరి దేవుళ్ళు సమానమే కాబట్టి అన్ని దేవుళ్ళను నమ్ముతాము, అన్ని పండుగలు జరుపుకుంటాం..ప్రతి ఒక్కరి సంస్కృతి సంప్రదాయలు పాటిస్తారు. ఇక్కడి కమ్యూనిటీ భవనానికి అనుమతులు రావాల్సి ఉందని, ఒక వేల వచ్చే ఏడాది క్రిస్మస్ లోగా కమ్యూనిటీ భవనం పూర్తయ్యేల చూస్తాం..చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పిన ఇతరులకు కొంత సాయం చేయడం అనేది నేను పాటిస్తున్నా, క్రిస్మస్ పండుగ మీ అందరి సమక్షంలో జరుపుకోలేకపోతున్నాను. కావున ఈ చర్చికి వచ్చి ప్రార్థనలు చేసుకునే అన్ని కుటుంబాలు క్రిస్మస్ రోజున వస్త్రాలు అందిస్తాం.. మొన్నటి రోజున రోజున మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల తీరు సరిగా లేదని మార్చుకుని అన్ని పంచాయతీలకు పారిశుధ్య పరికరాలు అందించాలని చెప్పగా ఒక పత్రిక కొంతమంది వైసీపీ నాయకులు అదేదో తప్పు అన్నట్లుగా వార్తలు రాశారు..కానీ అందుకు సీఎమ్ ఓ కార్యాలయం నుంచి స్పందించి ఎందుకు కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు అని ఆరా తీస్తే మాకున్న పంచాయతీలకు అన్నింటికీ సరిపోయేలా ట్రై సైకిల్స్, చెత్త కుండీలు, తోపుడు బళ్ళు అందించాలని చెప్పగానే వెంటనే అన్ని పంచాయతీలకు ఇస్తున్నట్లు తెలిపారు అన్నారు..కేవలం కొందరు అలాంటి వాటిని కూడా రాజకీయం చేయాలకుంటున్నారు అన్నారు..







Comments