సమస్యల పరిష్కారానికి సమన్వయం అవసరం: ఆర్‌జివి కృష్ణ
కర్నూలు: ప్రజా సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని నగరపాలక ఇంచార్జీ కమిషనర్ ఆర్‌జివి కృష్ణ అధికారులను కోరారు. సోమవారం ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలో జరిగిన 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక'లో ఆయన పాల్గొని, వివిధ వార్డుల నుండి 17 అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, డాక్టర్ నాగశివ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.









Comments