• Aug 25, 2026
  • NPN Log

    కావలసిన పదార్థాలు: పనీర్‌ - 200 గ్రాములు, ఉడికించిన ఆలుగడ్డలు - రెండు, టమాటా, ఉల్లిముక్కలు - అర కప్పు, కొత్తిమీర తరుగు - కప్పు, వేయించిన పల్లీల ముక్కలు - స్పూను, నిమ్మరసం - రెండు స్పూన్లు, చాట్‌ మసాలా - స్పూను, పుదీనా ఆకులు - కొన్ని, పచ్చి మిర్చి - 8, జీలకర్ర - స్పూను, సేవ్‌ - రెండు స్పూన్లు, అల్లం - కాస్త, చింతపండు రసం - అర కప్పు, గింజలు తీసిన మెత్తని ఖర్జూరం - అర కప్పు, బెల్లం - అర కప్పు, నూనె, ఉప్పు, నీళ్లు - తగినంత.

    తయారుచేసే విధానం: కొత్తిమీర తరుగు నుంచి రెండు స్పూన్లు పక్కన పెట్టుకోవాలి. మిగతా కొత్తిమీరుకు పుుదీనా ఆకులు, పచ్చి మిర్చి, జీలకర్ర, అల్లం మిక్సీలో వేసి గ్రీన్‌ చట్నీ చేసుకోవాలి. చింతపండు, ఖర్జూరాలు, బెల్లం మిక్సీలో వేసి స్వీట్‌ చట్నీ చేయాలి. ఓ బాణలిలో కాస్త నూనె వేసి పనీర్‌ ముక్కలు వేయించాలి. ఓ పెద్ద గిన్నెలో ఈ పనీర్‌ ముక్కలు, ఉడికించిన ఆలు, మిగతా కూరగాయలు, కొత్తి మీర, పల్లీలు, ఛాట్‌ మసాలా, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమానికి గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ వేసి కలిపితే ఆలూ పనీర్‌ ఛాట్‌ తయారు. పైన కొత్తిమీర, సేవ్‌ వేస్తే సరి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement