• Aug 25, 2026
  • NPN Log

    డార్విన్‌లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు టెస్టు ఫార్మాట్‌లో ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌ను బంగ్లా జట్టు నాలుగు రోజుల్లోనే ముగించడం విశేషం. ఈ విజయంపై బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ షాంటో స్పందించాడు. మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో మాట్లాడుతూ.. 'మా దేశ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత గొప్ప విజయం. టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లలో బంగ్లాదేశ్‌కు అనేక గొప్ప విజయాలు ఉన్నాయి. కానీ నా దృష్టిలో అయితే ఇప్ప‌టివ‌ర‌కు మేము సాధించిన వాటిలో ఇవాళ ఆస్ట్రేలియాపై సాధించినదే అతి పెద్ద విజ‌యం. దీని వెనుక ఎంతో కృషి ఉంది. ఈ మ్యాచ్ అసాంతం మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం' అని నజ్ముల్ పేర్కొన్నాడు.

    'మ్యాచ్‌ను చివరి రోజు వరకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా బరిలోకి దిగాము. ప్రతీ సెషన్‌లోనూ పోరాట పటిమ కనబర్చాలని అనుకున్నాము. మా వ్యూహానికి తగ్గట్టుగానే తొలి రోజు నుంచే మేము ప్రత్యర్థిపై పైచేయి సాధించాం. ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరు కీలక పాత్ర పోషించారు' అని నజ్ముల్ షాంటో వెల్లడించాడు. రెండో టెస్టు మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి 26 వరకు జరగనుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement