ఇంకెన్నాళ్లు.. అప్డేట్ అవ్వండి!
ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో దరఖాస్తు పత్రాలు(200KB), ఫొటోలు (100KB), సిగ్నేచర్ (50KB) వంటి అప్‌లోడ్‌కు సైజు పరిమితులు ఉండటంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెట్ వేగం తక్కువగా ఉండేదని.. నేటి హైస్పీడ్ నెట్ యుగంలో నాణ్యత తగ్గించడానికి ఇతర యాప్స్ వాడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఫైల్ అప్‌లోడ్ చేశాక సర్వరే దాని పరిమాణాన్ని తగ్గించుకునేలా మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. దీనిపై మీకామెంట్?









Comments