• Sep 20, 2026
  • NPN Log

    విజయవాడ : దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రికి వచ్చిన భక్తులకు లడ్డూల విక్రయానికి ఏటీఎం సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత లడ్డూ ప్రసాదాల కోసం క్యూల్లో గంటల తరబడి వేచిఉండే అవసరం లేకుండా స్మార్ట్‌ విధానంలో త్వరితగతిన సేవలు పొందేలా దీన్ని రూపొందించారు. ఈ లడ్డూ ఏటీఎంలను ప్రస్తుతం పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో పరిశీలన నిమిత్తం అందుబాటులో ఉంచారు. ఈ ఏటీఎంలు పెద్ద ఫ్రిజ్‌ మాదిరిగా ఉండి, అరలను కలిగి ఉంటాయి. ఆరు లడ్డూలతో ప్యాక్‌ చేసిన బాక్స్‌లను ఈ అరల్లో ఉంచుతారు. ఏటీఎం స్ర్కీన్‌పై ఎన్ని బాక్స్‌లు కావాలో భక్తులు ఎంపిక చేసుకోవాలి. వాటిని ఓకే చేసిన తర్వాత క్యూఆర్‌ కోడ్‌ తెరుచుకుంటుంది. దానిద్వారా యూపీఐ చెల్లింపులు చేయాలి. ఆ మేరకు లడ్డూల బాక్స్‌లు బయటకు వస్తాయి. దీనిద్వారా భక్తులు సత్వరమే లడ్డూలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement