• Sep 20, 2026
  • NPN Log

    ఉరవకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు అక్కడికక్కడే మృతి

    ఉరవకొండ (NPN వార్త):

    ఉరవకొండ పట్టణ శివారులోని మైక్రో స్టేషన్ సమీపంలో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

    ​మృతులను వజ్రకరూరు గ్రామానికి చెందిన జైనుల్లా, మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీలుగా పోలీసులు గుర్తించారు. కోర్టు సంబంధిత పని నిమిత్తం ఉరవకొండకు వచ్చిన వీరు, తిరిగి స్వగ్రామం వజ్రకరూరుకు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా మైక్రో స్టేషన్ వద్ద ఈ విపత్తు సంభవించింది.

    ​సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమై పరారైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో వజ్రకరూరులో విషాదఛాయలు అలముకున్నాయి. 

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement