• Apr 30, 2026
  • NPN Log

    వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పానీయాలు తీసుకోవడం చాలా అవసరం. ఎండల తీవ్రత, ఉక్కపోత వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనిని నివారించడానికి, శరీరాన్ని చల్లబరచడానికి, శక్తిని అందించడానికి కొన్ని ప్రత్యేక పానీయాలు తీసుకోవాలి. సాధారణంగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయ జ్యూస్ వంటివి ఎక్కువ మంది తాగుతుంటారు. అయితే, బెల్లం నిమ్మరసం పానీయం ఎప్పుడైనా ట్రై చేశారా? బెల్లం నిమ్మరసం పానీయం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడానికి, శరీరాన్ని డీటాక్స్ చేయడానికి సహాయపడుతుందని అంటున్నారు. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఈ పానీయం తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది విటమిన్ సి, ఐరన్‌ను అందించి, శరీరంలో మలినాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.

     

    తయారీ విధానం:

    ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.

    అందులో ఒక టీస్పూన్ బెల్లం పొడి (లేదా చిన్న బెల్లం ముక్క) వేసి కరిగే వరకు కలపాలి.

    చివరగా ఒక చెంచా తాజా నిమ్మరసం పిండుకోవాలి.

    అవసరమైతే రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు కూడా జల్లుకోవచ్చు.

    బెల్లం నిమ్మరసం ప్రయోజనాలు:

    బరువు తగ్గుదల: ఇది కొవ్వును కరిగించి, జీవక్రియను మెరుగుపరుస్తుంది.

    శరీర నిర్విషీకరణ : కాలేయాన్ని శుభ్రపరిచి, శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపుతుంది.

    రోగనిరోధక శక్తి: విటమిన్ సి ఉండటం వల్ల జలుబు, దగ్గు నుంచి రక్షణ కల్పిస్తుంది.

    జీర్ణక్రియ: జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).