.ఎమ్మెల్యే అమిలినేని గారి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న ఇండిపెండెంట్ కౌన్సిలర్ టీ గౌతమిసోమశేఖర్.
కళ్యాణదుర్గం పట్టణంలో కుల రాజకీయాలకు కాకుండా రాజకీయం అంటే అభివృద్ధి సంక్షేమం అని నిరూపిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సారథ్యంలో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం పార్టీలోకి చేరామని కళ్యాణదుర్గం మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ టీ గౌతమి సోమశేఖర్ తెలిపారు..అభివృద్ధిని అడ్డుకోవాలని కేవలం కుల రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులకు బుద్ది చెప్పాలనే ఉద్దేశ్యంతోనే నేడు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు గౌతమి సోమశేఖర్ పేర్కొన్నారు.. నేడు అనంతపురం పట్టణంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ టీ గౌతమిసోమశేఖర్ గారికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు..ఎమ్మెల్యే అమిలినేని గారు మాట్లాడుతూ అభివృద్ధికి సహకరించే ప్రతి ఒక్కరు తమ వెంట నడుస్తారని, కేవలం కుల రాజకీయాలతో తమ పదవులు కాపాడుకోవాలనే వారు కాదని అన్నారు.. గత రెండు రోజులుగా మా కౌన్సిలర్లను సైతం కులం పేరు చెప్పి రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూసారని, మా నాయకులను కూడా వైసీపీ మండల మండల పార్టీ కన్వీనర్లు బెదిరింపులు చేస్తుండటం సోషల్ మీడియాలో చూస్తున్నామని ఇంతకన్నా దౌర్బాగ్యం మరొకటి లేదని మండిపడ్డారు.. అభివృద్ధి చేయడం తెలియక కులాలను అడ్డుపెట్టికుని వైసీపీ నాయకులు తమ ఉనికిని చాటుకుంటున్నారని ఇలాంటివి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా సహించరని ఇప్పటికైనా మానుకోవాలని తెలిపారు..










Comments