ఎమ్మెల్యే ఇంటి పక్కనే మురికి గుంతలు: పౌర సంఘం ఆగ్రహం
కర్నూలు: నగరంలోని చంద్రమౌళి ఈశ్వర్ నగర్, పంచరత్న కాలనీల్లో రోడ్లు, కాలువలు లేక ప్రజలు నరకం చూస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి సమీపంలోనే ఉన్నా.. ఇళ్ల ముందు మురికి నీరు నిలిచి గ్రామాల కంటే హీనంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నేత ఇరిగినేని పుల్లారెడ్డి నేడు ఆయా కాలనీల్లో పర్యటించారు. అధికారులకు అనవసర పనులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని మండిపడ్డారు. వెంటనే సమస్యలు పరిష్కరించకుంటే కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.








Comments